అనగనగా ఒక డైట్ కధ!!!!!!!
"ఒరేయ్ వెధవ! జాగ్రత్తరా!!! బైక్ నెమ్మదిగా నడుపు నీకు ఎందుకంత కంగారు, నీ డ్రైవింగ్ అంటే నాకు అందుకే భయం"......వెనకాల కూర్చున్న మా నాన్నారు అరుస్తున్నారు. మా నాన్నని ఎప్పుడూ ఇలాగే భయపెడుతూ ఉంటాను. దాంతో నాకు ఆయన చేతిలో ఇంటికి వెళ్ళేంతవరకు తిట్లు, ఆ తర్వాత మా అమ్మ చేతితో చేసిన అట్లు తినడం అలవాటైపోయింది. ఎప్పట్లాగే మా నాన్నగారిని ప్రొద్దున్న స్విమ్మింగ్ పూల్ నుంచీ ఇంటికి తీసుకురావడం రోజూ నా డ్యూటి. ఆ తర్వాత ఇంటికి రాగానే వెంటనే ఎవరి పనులకి వాళ్ళు రెడీ అయిపోయి అదే బైక్ మీద మా నాన్నారు, నన్ను మా చెల్లిని కాలేజ్ కి దింపి రైయ్ మని ఆయన ఆఫీస్ కి వెళ్ళడం, తిరిగి సాయంత్రం ఎవరి దారిన వాళ్ళం ఇంటికి రావడం, మేమేదో దేశాన్ని మా భుజస్కందాలమీద మోసి అలసిసొలసీ అన్నంత కట్టింగ్ ఇచ్చి ఒకళ్ళం బెడ్ మీదా, ఒకళ్ళు టీవీకి, కంప్యూటర్ కి అతుక్కుపోయేవాళ్ళం. పాపం మా అమ్మకి మా సేవ ఎక్కువైపోయెది. ఎప్పుడూ విసుక్కోకుండా మాకు నచ్చినవన్ని చేసేది . మా చెల్లి ఎప్పుడూ చిన్నపట్నుంచీ తిండి అంటే మాత్రం ఎలాదాన్ని ఎగ్గొట్టాలా అని తెగ స్కెచ్లు వేస్తూ ఉ...