నేనూ, రామయ్య!!!
నేను : ఏమయ్యా రామయ్య! ఇది ఏమన్నా నీకు న్యాయంగా ఉందా!!! రామ : ఏమిటయ్యా అనంతూ...... ఎప్పుడూ ఎదో ఒకటి లేదని ఏడుస్తావు (నాపై చిరునవ్వు బాణాన్ని సంధిస్తూ....) నేను : అసలు ఎమున్నాయని రామా! నాకు చెప్పుకోవడానికీ..... నాకు తెలిసిన వాళ్ళందరూ మంచి సాలరీస్ తో ఎంజాయ్ చేస్తుంటే, నేను మాత్రం ఇలా దారంలేని గాలిపటంలాగా, తాడులేని బొంగరంలాగా, ఎడ్రెస్ లేని పోస్ట్-కార్డ్ లాగా, హెడ్ లైట్ లేని ఆడీకార్ లాగా, ఆధార్ కార్డ్ లేని సిటిజెన్ లాగా,నెయ్యిలేని పప్పన్నంలాగా, ఉప్పు లేని టమాటాసూప్ లాగా, ఎండింగ్ అనేది లేని మొగలిరేకులు సీరియల్ లాగా, తుప్పు పట్టిన ఇనుపరే......... రామ : చాలు చాలు చాలు!!!! నీతో వచ్చిన గొడవ ఇదేనయ్యా!! నీకు చాన్స్ ఇస్తే ఉపమానాలతో ఉప్మా వండేస్తావు అలాంటి రకానివి నువ్వు.....:) (అదే చిరునవ్వు బాణం విసురుతూ) నేను : నా బాధలు చెప్తుంటే !నీకు పార్లెమెంట్లో ప్రతిపక్షనాయకున్ని చూసినట్టు చూస్తున్నావు నన్ను.......... (కోపంగా ఆయన వైపు చుస్తూ) రామ : ఈ ప్రపంచంలో ప్రతివాడికి ఎన్నో బాధలు ఉంటాయ్. అంతెందుకు చివరికి జంతువులకి, పక్షులకి, పురుగులకి కూడా వాటి పరిధిలో వాటికి సమస్యలు ఉంటాయ్...... అవే ఎప్పుడ...