Posts

Showing posts from 2016

నీ కనులు కన్న ప్రతీ కల నాకు సొంతం

Image
     ఎందుకో నాకు ప్రేమకధానేపధ్యంతో కూడిన ఒక వైవిధ్యమైన పుస్తకం చదవాలనిపించింది. ప్రేమకధలు తెరపైన చూసినప్పుడు మనం ఒక కోణంలోంచే చూస్తాం. అదే చదివినప్పుడు ప్రేమని 360 డిగ్రీస్ లో మన:ఫలకంపై ఒక దృశ్యకావ్యమై చెరగని ముద్రవేస్తుంది. మరి అలాంటి కధలు ఈమధ్య ఎక్కడవున్నాయి?? చాలావరకు ప్రేమముసుగులో ఒక ఆకర్షణని ఒక తెలిసీతెలియని వయసువల్ల ఏర్పడిన నరాలని ఉత్తేజపరిచే చౌకబారు సాహిత్యం స్వచ్చమైన ప్రేమని ఒక లైంగికచర్యగామాత్రమే చూపెడుతూ అపహాస్యం చేస్తోంది.           ప్రేమకధలు అందరికీ ఉంటాయి అందులో కొన్ని నిజమవుతాయి కొన్ని అందమైన అబద్దలుగా మిగిలిపోతాయి కొన్ని భావుకత్వం తో గుబాళిస్తాయి కొన్ని మొగ్గలోనే ధైర్యం చాలక అంతరిస్తాయి. అన్ని ప్రేమకధలు గొప్పవికావు ప్రేమని ఎప్పుడైతే ఒక దృష్టికోణంలో మాత్రమే చూడటం మొదలుపెడతామో అప్పుడే ఆ ప్రేమకధ ముగింపు దశ చేరుకున్నట్టే. ఏది ప్రేమో ఏది ఆకర్షణో ఏది హేయమైన శారిరిక అవసరమో లేదా కేవలం ఒక ఏమోషనల్ డెపెండెన్సిఓ తెలుసుకోవడంలోనే చాల ఎదురుదెబ్బలు తింటాం.          ఇన్ని ఇరుకుసందులమద్యకూడా మనం జీవితాంతం నిజమైన ప్రేమని ...