Posts

Showing posts from October, 2012

చీకటిని తరిమేసే చిరునవ్వుల దీపాలు

Image
చిన్నారిపొన్నారి చిరునవ్వులబుజ్జాయి నీ లేలేతపాదాలను నేలమ్మను  ముద్దాడి నీ సిరిమువ్వలగజ్జలతో తనయెదపై నువ్వు నర్తిస్తుంటే ఆకాశం ఆక్రోసించింది తనకు ఆ అదృష్టంలేదని....... ఆ అక్రోసాన్నికూడా ఆనందంగా మార్చింది నీ ఆనందతాండవం...... అది గమనించిన ఆకాశం తన ఆనందభాష్పాలతో నీకు అభిషేకం చేసింది చిరుజల్లులతొ..... నువ్వు వానజల్లులో పాలబుగ్గలతో ఆడుకుంటుంటే మేఘాలు చప్పట్లు కొడుతూ నీ నర్తనకి తాళంవేస్తున్నాయి...... అమ్మ నీకోసం జాబిల్లిని రారమ్మని ఆహ్వానాన్ని పంపితే,తను రాలేని అశక్తతను, నిన్ను ఎత్తుకోలేని దురదృష్టాన్ని తిట్టుకుంటూ బాధతో రోజురోజుకీ కందిపోతున్నాడు చిన్నారి పొన్నారి బుజ్జాయీ ఒక్కచిరునవ్వు వరము ఈయవమ్మ జాబిల్లికీ,  మళ్ళీ దానితో పున్నమి వెన్నెలని పండిచగలడు........ నీమీద ఏ గాలిశొకిందో, ఏ కన్నుపడిందో,విధి వెక్కిరించిందోగానీ??? కొందరి మనుష్యులలోని రాక్షసత్వానికి బలి అయ్యింది నీ మనోహరమైన చిరునవ్వు........ నీ కన్నీరుకూడా కరిగించలేకపోయింది ఆ రాతికొండలాంటి గుండెలని......... నువ్వు నర్తించినా, నవ్వినా, ఏడ్చినా చివరికి నువ్వు నిద్రపోతున్నా కూడా నీ కలలను చూసి మురుసిపోయింది...