చీకటిని తరిమేసే చిరునవ్వుల దీపాలు
చిన్నారిపొన్నారి చిరునవ్వులబుజ్జాయి
నీ లేలేతపాదాలను నేలమ్మను ముద్దాడి
నీ సిరిమువ్వలగజ్జలతో తనయెదపై నువ్వు నర్తిస్తుంటే
ఆకాశం ఆక్రోసించింది తనకు ఆ అదృష్టంలేదని.......
ఆ అక్రోసాన్నికూడా ఆనందంగా మార్చింది నీ ఆనందతాండవం......
అది గమనించిన ఆకాశం తన ఆనందభాష్పాలతో నీకు అభిషేకం చేసింది చిరుజల్లులతొ.....
నువ్వు వానజల్లులో పాలబుగ్గలతో ఆడుకుంటుంటే మేఘాలు చప్పట్లు కొడుతూ నీ నర్తనకి తాళంవేస్తున్నాయి......
అమ్మ నీకోసం జాబిల్లిని రారమ్మని ఆహ్వానాన్ని పంపితే,తను రాలేని అశక్తతను, నిన్ను ఎత్తుకోలేని దురదృష్టాన్ని తిట్టుకుంటూ బాధతో రోజురోజుకీ కందిపోతున్నాడు
చిన్నారి పొన్నారి బుజ్జాయీ ఒక్కచిరునవ్వు వరము ఈయవమ్మ జాబిల్లికీ, మళ్ళీ దానితో పున్నమి వెన్నెలని పండిచగలడు........
నీమీద ఏ గాలిశొకిందో, ఏ కన్నుపడిందో,విధి వెక్కిరించిందోగానీ??? కొందరి
మనుష్యులలోని రాక్షసత్వానికి బలి అయ్యింది నీ మనోహరమైన చిరునవ్వు........
నీ కన్నీరుకూడా కరిగించలేకపోయింది ఆ రాతికొండలాంటి గుండెలని.........
నువ్వు నర్తించినా, నవ్వినా, ఏడ్చినా చివరికి నువ్వు నిద్రపోతున్నా కూడా నీ కలలను చూసి మురుసిపోయింది ఆ ప్రకృతి.......
కానీ మా మనుష్యుల్లోని స్వార్ధం, నీ దివ్యత్వాన్ని సహించలేక నీ మీదపగబట్టి బలిచేస్తే ఆఖరిక్షణాలలో కూడా నువ్వు నవ్వావు మాలోని అజ్ఞానాన్ని చూసి......
మానవత్వాన్ని వదిలేసి ఆటవికత్వాన్ని తలకి ఎక్కించుకున్న మాకు,
ఒక్కసారి మమ్మల్ని క్షమించవూ!!!!
ఒక్కసారి నీలా స్వచ్చంగా నవ్వడం నేర్పవూ!!!
ఒక్కసారి నీలా జీవించడం ఎలాగో తెలుపవూ!!!
ప్రకృతిని శాసించాలని మేము అహంతో పరుగులు పెడుతూ, ఎండమావులవంటి ప్రాపంచికసుఖాలకోసం ప్రాణాలను వేటాడుతూ, మృగాలలాగా సంచరించేమాకు నీ అమాయకత్వంతో మాలోని మాయని మాయం చేయి!!!
నీ చిరునవ్వులమతాబుతో మాలో నిండిన చిక్కటి చీకటిని తరిమేయి!!!
ఆకాసంలో నక్షత్రాన్నివై మా గుండెల్లో చిరుదివ్వెవై చిరంజీవిగా వర్ధిల్లు.......
జీవితసరాగల ఆనందపుదారాలతో మమ్మల్నికట్టి నీ లేత చేతులతొ నింగిలోకి గాలిపటంలాగా మమ్మల్ని ఎగురవేయీ!!!
ఓ చిన్నారి పొన్నారి చిరునవ్వుల బుజ్జాయీ........
![]() |
| మానవత్వపు పరిమళాన్ని మాకు అందించు |
![]() |
| ఎంత ఎదిగినా ఒదిగి ఉండు |
![]() |
| తప్పటడుగులు వేసినా తప్పు తెలుసుకునేటట్లు చేయి |
![]() |
| ప్రతినిముషం జీవించు, నవ్వించు, ఆనందించు ఇతరులను ప్రేమించు, చివరికు మరణించు |
MY DEEPEST CONDOLENCES TO DEATH OF SAANVI A 10-MONTH OLD BABY GIRL WHO WAS BRUTALLY MURDERED BY PSYCHO-KILLERS IN AMERICA FOR SAKE OF MONEY AND THIRST FOR BLOOD........... CRUELTY IS THE SYNONYM FOR THEM TO DESCRIBE..........
MAY GOD GIVE THE MENTAL STRENGTH TO THE PARENTS OF SAANVI TO BEAR THE PAIN FOR THEIR PRECIOUS LOSS OF THEIR CHILD................
R.I.P. ANGEL SAANVI..... WE MISS U EVER AND FOR EVER.......... :`(




Comments
Post a Comment