వందేమాతరం
వెండివెలుగులు చీకటితో రహస్యం చెప్పింది నువ్వు ఇప్పుడు స్వేచ్చావిహంగాలని ఎగురవేయొచ్చని.........
అప్పుడుతెలిసింది మాకు స్వాతంత్ర్యం వచ్చిందని...........
స్వేచ్చ ఒకటే కాదు భారతీయులకి కావలిసింది, బాధ్యతకూడా తెలియాలని........
దేశభక్తి అంటే క్రికెట్ మ్యాచ్లు కావని, వర్గపోరాటాలు కావని, మతమార్పిడులుకావనీ, చేతివేళ్ళలాగా కలిసిపనిచేసి దేశాన్ని ఉన్నతంగా నిలబెట్టాలని.............
మతం అంటే అరాచకంకాదు మనసుకు సాంత్వనని ఇచ్చే
ఆధ్యాత్మికత అనీ,
సంస్కృతి అంటే మూడనమ్మకాలుకావనీ అవి అందరినీ దగ్గరచేసే
వారధి అనీ........
త్రివర్ణపతాకాన్ని గర్వంతో రెపరెపలాడిoచాలిగానీ భయంతో వణికిపోయేలా చేయకూడదని.........
మానవత్వం కేవలం ఇలా వ్రాతలలోనే ఉండవనీ అది మనంచేసే మంచికి సమాధానంగా ఇతరుల కళ్ళలోని వెలుగుని తెస్తుందనీ ఒక చిరునవ్వు విరబూస్తుందనీ, ఆ నవ్వులోనే మనకు ఆ పరమాత్ముడు పలకరిస్తాడనీ……… చెప్తోంది మరి వినబడుతుందా అందరికీ??????????
అప్పుడు అర్ధమయ్యింది మాకు, గణతంత్రదేశంగా ప్రజాస్వామ్యానికి తలఒగ్గి స్వేచ్చతోబాటు బాధ్యతలనుకూడా ప్రేమించాలని............
ఆలస్యంగా ఈ పోస్ట్ ని రాసినందుకు నన్ను సహృదయంతో మన్నింపగలరు :)



Comments
Post a Comment