ప్రకృతిలో ఒకడు
"మీరు ఇప్పుడు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచీ వాతావరణ విశేషాలు వింటున్నారు. బంగాలాఖాతంలో అల్పపీడనంవల్ల తుఫాను సూచనలు కనపడుతున్నాయి దీనివల్ల రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో భారీవర్షాలుపడే అవకాశం ఉంది. జాలర్లు ఎవరూ సముద్రంలోకి వేటకి వెళ్ళకూడదని సూచిస్తున్నాము."
"ఒరేయ్! ఈరిబాబు రేపు ప్రొద్దుగుంకేలోపు సముద్రంలోకి మన పడవలు వేటకి ఎల్లాల. నువ్వు దగ్గరుండి బోటుల్లోకి వలలు, తెరచాపలు గట్రాలాంటివి మనోల్లకి సిద్దంచేసి ఉంచమని చెప్పు."
"పెద్దయ్యా! మరి తుఫాను అంటున్నారుకదయ్యా! పెమాదం ఏమోనయ్యా వెళితే?"
"నోర్ముయ్ రా! సెప్పిందిసేయడమే నీపని. అయినా ఆల్లేమన్నా దేవుల్లేంటిరా వాళ్ళు సెప్పిందల్ల జరగడానికి, పులసలు, టూనా చేపలు దొరికే వేల ఇది. మాంచి గిట్టుబాటు వచ్చేటప్పుడు ఇదంతా ఎవడు పట్టించుకుంటాడు రా!"
"ఓ పేద్ద హొటేలువాళ్ళు అప్పుడే బేరం కుదుర్చుకున్నారు కూడా! ఈ టైంలో నాకు నువ్వు నీతులు సెప్పడానికి సూసావనుకో సొరచేపకి నిన్ను ఎరవేసేస్తాన్రోయ్. పోయి నేసెప్పిన పని సూడరా నెలతక్కువ నాయాల." అని వెళ్ళిపోయాడు.
ఈరిబాబు చాలా భారంగా నిట్టూర్చాడు. తనకి ఇవన్నీ అలవాటు అయిపోయింది. పెద్దయ్యకి ఎప్పుడూ తన వ్యాపారం గొడవేగాని మనుషులుగురుంచి పట్టదు కదా! పెద్దయ్య చెప్పినవి పురమాయించి తన గుడిసకి దారి తీసాడు.
తను అలా ఇసుకతిన్నలపై నడుస్తుంటే సముద్రపుగాలి తన మనసులోని అలజడి నుంచీ, శరీరపు అలసట నుంచీ సేదతీరుస్తున్నట్టనిపించింది. అందుకే ఈరిబాబుకి తన నాన్న అంటే ఎంత ఇష్టమో తననూ, తన కుటుంబానికీ ఇంత కూడు పెడుతున్న ఈ సముద్రమన్న అంతే ఇష్టం.
ఆ గాలి తగలగానే బాల్యం, తన ఙ్ఞాపకాల వాకిట్లోకి వచ్చి పలకరించింది. తనకింకా గుర్తు తన నాన్నతో కలిసి సముద్రంలోకి వేటకి వెళ్ళినప్పుడు తను "కొర్రమీను" ని ఒడుపుగా వలేసి పట్టుకున్నప్పుడు, తన తండ్రి చూసిన ఒకింత గర్వపుచూపు ఇంకా గుర్తుంది.
పొద్దుగుంకేలోపు వేటకి వెళ్ళడం, చీకటి పడేలోపు తెచ్చిన వేటని అమ్ముకుని ఇల్లు చేరడం ఇవే తెలుసు.తను నాన్న, అమ్మ ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. ఒకవేళ వేట దొరక్కపోయినా కూడా సంతోషంగ ఉండేవాడు నాన్న. అమ్మ తనకి ఏంపెట్టాలో తెలియనప్పుడు తను పస్తుండి మరీ తనకి చల్దికూడు పెట్టేది.
నాన్న ఎప్పుడూ తనకి ఒకమాట చెప్పేవాడు. ఒరేయ్! మనకి ఈ సముద్రం గంగమ్మతల్లి రా. మనకి ఇంతకూడు పెడతాంది, మనవల్ల ఇంకొకల్ల పొట్టనింపుతాంది. ఈ వృత్తి మనకు దైవంలాంటిది రా! నువ్వు బాగా సదువుకుని ఊళ్ళు ఏలక్కర్లేదు ఈ తల్లి ఒడిలో బతికితే సాలు అని." ఆ మాటకి ఇప్పటికీ కట్టుబడి ఉండిపోయాడు తను.
తన చిన్నప్పుడు తన స్నేహితులుతో కలిసి శారదానదీ, వారాహీ నది కలిసిన సాగర సంగమంలో ఈతకొట్టడం అంటే ఆరోజుల్లో తనకి ఎంత ఉత్సాహం ఉండెదో మాటల్లో చెప్పలేడు. తన నాన్నే దగ్గరుండి ఈత నేర్పించాడు. ఆరోజులు మరి ఇక రావు కద!
ఆరోజు తన పుట్టినరోజు పద్దెనిమిదేళ్ళు వచ్చాయ్.తన నాన్న సముద్రంలోకి వెళ్తుంటే ఈరిబాబుని పిలిచి "ఒరేయ్! నువ్వు నా సేతికి అందివచ్చేసవ్ ఇంక రేపట్నుంచీ నువ్వే వేటకి వెళ్తావ్. ఈరోజుతో నా ఆఖరి పయనం రా ఆ గంగమ్మ తల్లి ఒడిలోకి వెళ్ళేది ఇంక. నీకు పేద్ద పేద్ద సదువులు సెప్పించలేకపోవచ్చు, ఆస్తులు ఇవ్వకపోవచ్చు. కాని నీ కాళ్ళ మీద నువ్వు బ్రతికే భరోసాని ఇచ్చాను. నీ పుట్టినరోజుని ఎప్పుడూ పేద్ద పండగలాగ సేయలేదు. దానికి నువ్వు ఎప్పుడన్న బాధపడ్డావో లేదో తెలియదు కానీ నేను మాత్రం సానా బాధపడేవాన్ని రా! నీకు మంచి సదువు సెప్పించలేకపొయినాను. నన్ను క్షమించరా బిడ్డా!" అని ఏడ్చాడు .
ఈరిబాబుకి కూడ కన్నీళ్ళు ఆగలేదు. "ఊరుకో అయ్యా! నువ్వు నాకు సదువు సెప్పించలేకపోయినా సంస్కారం నేర్పించినావు, నువ్వు తెచ్చే నిజాయతీగల సంపాదన, అమ్మ చేతి చేపల పులుసే నాకు పేద్ద ఆస్తులూ, పంచభక్ష్య పరమాన్నాలు. ఇంకెప్పుడూ అలా బాధపడమాకు. ఇకనుంచీ నేనే వేటకి వెళ్తా. నిన్ను, అమ్మనీ బాగ సూసుకుంట" అన్నాడు.
" చాలు రా! నువ్వు ఇంకా ఎదిగావు. ఈరోజు చక్కగ ఇంటిపట్టున ఉండి అమ్మ చేతి తిండి తిని నీ స్నేహితులతో గడుపు. ఇదిగో ఈ వందరూపాయలు ఉంచు" అని బలవంతంగా వద్దు వద్దన్నా తన జేబులో పెట్టాడు.
బోటు సముద్రంలోకి వెళ్లిన్ది.
ఆరోజు తను ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంక తన సొంత పడవలో నాన్న ఇచ్చిన భరోసాతో ఇంక తను వేటకివెల్లొచ్చు అనే ఉత్సాహం తన కాలుని భూమి మీద నిలవనీయలేదు.
సాయంత్రం అయిపోవచ్చింది, మబ్బులు సూర్యునితో దోబూచులాట మొదలుపెట్టాయ్. గువ్వలు రివ్వున సముద్రంపైనుంచీ ఎగురుతూ గూటికి చేరుతున్నాయ్. చీకటితెర వేసి వెన్నెలమ్మ చిందులు తొక్కడానికి సిద్ధమయింది. చిన్నపిల్లలు ఇసుకలో గూళ్ళు కట్టుకుంటూ సంతోషంగా ఆడుకుంటున్నారు. అంత మనోహరమైన దృశ్యాలను చూస్తూ ఆ సముద్రపు ఒడ్డున కూర్చుని ఆనందిస్తున్నాడు. ఇంతలో ఎవరో "ఒరేయ్! ఈరిబాబు అన్యాయం జరిగిపోయినాది రా మీ నాయనని సొరమింగేసింది రా! " అంటూ ఎడుస్తూ పరుగెత్తుకుని వచ్చి చెబుతున్నారు.
ఈరిబాబుకి మెదడు పనిజేయటం మానేసింది అప్పటికే. ఎవరో తనని ఎవరెస్టు శిఖరమ్నుంచీ అగాధంలోకి నెట్టునట్టు ఉంది. ఇంక పరుగు ఆపకుండా గుడిసవైపు వెళ్ళాడు. జనం గూమిగూడి ఉన్నారు, అక్కడ పెడబొబ్బలు పెడుతూ ఏడుస్తున్నా తన చెవికి వెళ్ళడం లేదు, తన అమ్మ నిశ్శబ్ధంగా కూర్చుంది తనకి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. నాన్న శవం కూడా దొరకలేదట. నాన్నకి ఉన్నట్టుండీ కాలుజారి సముద్రంలోకి పడగానే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు సొరచేప తనని బలిగొంది. రక్షిద్దాము అనుకునేలోపే అంతా జరిగిపోయింది. "ఇదే రా నా ఆఖరి పయనం ఆ గంగమ్మతల్లి ఒడిలోకి వెళ్ళేది" అన్న నాన్న మాటని ఆ తల్లి విందేమో! తన బిడ్డని తన దగ్గర తెచ్చుకుంది.
ఆ బాధలో పది సూర్యోదయాలు ఉదయించిన విషయం వాళ్ళకి తెలియలేదు. ఎందుకంటే ఆ ఇంటి సూర్యుడు అస్తమించాడని ఇక ఉదయించడన్న నిజం, వాళ్ళ జీవితాన్ని కటిక చీకటిలోకి నెట్టింది.
చీకటిలో ఉన్నామని వెలుగుకోసం వెతకకపోతే ఇంకా జీవితం దుర్భరం అవుతుందని ఈరిబాబుకి అనిపించింది. గుడిసలో పొయ్యి వెలిగించి పదిరోజులు అయిపోయింది. అమ్మ ఆరోగ్యం కూడ కొంచెం కొంచెం శుష్కిస్తోంది. . తనకు ఉన్నది ఇంక అమ్మ ఒక్కర్తే, అమ్మకి తనొక్కడే. అమ్మకి ఇంత అన్నం పెట్టాలి. ఎలా? ఎలా?
గుడిసలోంచి బయటకు పరిగెట్టాడు. అప్పుడే పెద్దయ్య పడవలు వేటకి పోతున్నాయి. అక్కడ పెద్దయ్యని కలిసి విషయం చెప్పాడు. జీవితాంతం తనదగ్గర పనికి కుదిరితేనే పని ఇస్తానన్నాడు. ఈరిబాబు ఆ బానిసత్వానికి ఒప్పుకున్నాడు.
"మడిసికి ఆకలి మా చెడ్డది రా! అది ఎంతకైనా తెగిస్తుంది. ఆశ ఇంకా మాసెడ్డది ఆకలి తీరిన తర్వాత ఇచ్చిన మాటకి ఎదురుతిరుగుతుంది. ఈ తెల్ల కాగితాలమీద వేలిముద్రేసి రేపొద్దుకాడనుంచీ పనికొచ్చేయ్. ఇందా" అని ఈరిబాబు చేతిలో కొంత డబ్బు పెట్టాడు పెద్దయ్య .
ఈరిబాబుకి ఆనందం వేసింది తన మొదటి సంపాదనను చూసి. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంటికి కావాల్సిన సరుకులు కొని ఇంటికి తీసుకువచ్చాడు.
ఆనందంగా "అమ్మా! అమ్మా! సరుకులు తెచ్చాను. అన్నం తిందువుగాని రా!" పొయ్యిలోకి కట్టెలు పెడుతూ అన్నాడు. అమ్మ అలాగే పడుకుని ఉంది. "రా అమ్మా! లేచికాస్తా ఎంగిలిపడు రా అమ్మ!" అని చెయ్యిపట్టుకున్నాడు. హిమాలయాన్ని తలపించింది ఆమె శరీరం. ఈరిబాబుకి అర్ధమయింది తనుకూడా నాన్న దగ్గరకే వెళ్ళిందని.
చిత్రంగా నవ్వడం మొదలుపెట్టాడు. నవ్వుతున్నా అతని కళ్ళు వర్షించాయి. ఇంక తను ఏకాకి అనుకున్నాడు. ఇంతలోనే సముద్రపుహోరు వినిపించింది. "నీకు నేనున్నాను రా!" అని చెపుతున్నట్లు ఉంది. అమ్మని కూడా కాటికి సాగనంపాడు. తను పెద్దయ్య దగ్గర పనికిపోయాడు.
ఇది ఈరిబాబు గతం. గతాన్ని తలుచుకున్నప్పుడు ఈరిబాబు చిరునవ్వు నవ్వుతాడు. ఏడవడానికి తనదగ్గర కనీళ్ళు ఎక్కడ ఉంటాయ్? అవి ఎప్పుడొ ఖర్చైపోయాయి. భవిష్యత్తు ఏంటని తనకు తాను ప్రశ్నించుకున్నప్పుడు శూన్యానికీ వెలుగుకీ మధ్య అతని గుండె కొట్టుకునేది. ఙ్ఞాపకాలు ముళ్ళై బాధ పెట్టేది. కళ్ళలో జోరువాన కురిసేది. అందుకే ఈరిబాబు "ఈ క్షణం" అనే గొడుగు పట్టుకున్నాడు. ఇంక తనకు గతంలేదు భవిష్యత్తు లేదు. "ఈ క్షణం" అనే స్థితిలో నాన్నను చూసుకుంటున్నాడు. ప్రకృతిలో అమ్మని చూసుకుంటున్నాడు. అందుకే అతని నడకలో భయంలేదు "నిబ్బరం" ఉంది. అతని ఉచ్వాస నిశ్వాశలలో నిస్పృహలేదు.
పెద్దయ్యలాంటి అవకాశవాదులు ఎంతమంది తనచుట్టూ ఉన్నా ప్రకృతిలోని అమృతత్వం అతనిని మంచితనం వైపు అడుగులువేయించింది. రేపటి ప్రొద్దుకి సూర్యుడు ఉదయిస్తాడు, ఈరిబాబు వేటకి వెళ్తాడు. ఇది అక్షర సత్యం. అతనికి భయం లేదు. విధి అతనికి మంచి చేస్తుందో చెడు చేస్తుందో తెలియదు. తనుతిరిగి వేటనుంచీ వచ్చేంతవరకూ అతనికి కూడా తెలియదు ఇంకో రోజు ఉంటుందని. పెద్దయ్యలాగా ప్రకృతిని శాసించాలనుకోడు ఇచ్చిన మాటకి కట్టుబడ్డాడు కానీ ఆకలికి కాదు. ఎందుకంటే అతను "ప్రకృతిలో ఒకడు."
అతను గుడిసెదగ్గరికి చేరాడు. ఉదయం గురుంచి ఎదురుచూడసాగాడు. నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి అతని కళ్ళలాగా........ .......

Comments
Post a Comment