బాపు - ఒక "చిత్ర" మాంత్రికుడు - ఒక "చరిత్ర"
బాపు.....
ఈ
పేరు వినగానే మన తెలుగు వారికి వెంటనే గుర్తొచ్చేది ఇద్దరు. అందులో ఒకల్లు భారతదేశానికి బానిసపు సంకెళ్ళను తెంచి స్వేచ్చాసమీరాన్ని అందించిన మహోన్నతుడు. ఇంకొకల్లు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తెలుగు సినిమాని అంతర్జాతీయ జాతీయ వేదికన తన ఆప్తమిత్రుడు ముళ్ళపూడి వెంకట రమణ తో కలిసి ఒక సుందర దృశ్యకావ్యం లా తీర్చిదిద్దిన మహోన్నతుడు. ఒక అమ్మాయిని పొగడాలి అంటే మనం ముందు తల్చుకోవాల్సింది ఆయననే. ఎలాగంటే ఆయన గీతల్లోనే ప్రాణంపోసుకున్న అప్సరసల అసలు పేరు "బాపు బొమ్మ". అదే అమ్మాయిల అందాన్ని వర్ణించడానికి అందమయిన కొలమానం ఇప్పటికీ అదే. అలాగ తెలుగువారి హృదయాలలో ఒక చెరగని ముద్రవేసి తన సినిమాలతో సంస్కారాన్నీ, అచ్చ తెలుగు నుడికారాన్నీ, అద్భుతమైన చిత్రాలనీ మనకు అందించిన "బాపు" ఈరోజు స్వర్గస్థులయ్యారు. అట్లాంటి మహోన్నతులు వెండి తెరపైనే కాదు బుల్లితెరపై కూడా చేసిన ఎన్నో అద్భుతాలను చెప్పడానికి చిన్నవాడినైన నా తరమూ కాదు ఆ అర్హతా లేదు. "భాగవతాన్ని" రసరమ్యంగా చెప్పి ఆబాలగోపాలాన్నీ ఉర్రూతలూగించిన ఆ మహమహులు మన మధ్యలేరు అన్న విషయమే జీర్ణించుకోలేకపోతున్నాను.
ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ, స్నేహానికి క్రొత్త అర్ధాన్ని ఇచ్చి ఆ "రాముని" చెంతకు చేరిన ఆ ఇద్దరు మిత్రులకు పాదాభివందనం చేస్తూ...............
రంగుల సీసా పగిలింది
అందమయిన బొమ్మకి ప్రాణం పోయింది
కన్నీరు గోదావరి లాగ పొంగింది
కుంచెతో కన్నీటిని తుడిచి నవ్వించడానికి మరి మా "బాపు" లేడుగా,,,,,,,,,,,,, :(




Comments
Post a Comment