ప్రకృతిలో ఒకడు
"మీరు ఇప్పుడు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచీ వాతావరణ విశేషాలు వింటున్నారు. బంగాలాఖాతంలో అల్పపీడనంవల్ల తుఫాను సూచనలు కనపడుతున్నాయి దీనివల్ల రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో భారీవర్షాలుపడే అవకాశం ఉంది. జాలర్లు ఎవరూ సముద్రంలోకి వేటకి వెళ్ళకూడదని సూచిస్తున్నాము." "ఒరేయ్! ఈరిబాబు రేపు ప్రొద్దుగుంకేలోపు సముద్రంలోకి మన పడవలు వేటకి ఎల్లాల. నువ్వు దగ్గరుండి బోటుల్లోకి వలలు, తెరచాపలు గట్రాలాంటివి మనోల్లకి సిద్దంచేసి ఉంచమని చెప్పు." "పెద్దయ్యా! మరి తుఫాను అంటున్నారుకదయ్యా! పెమాదం ఏమోనయ్యా వెళితే?" "నోర్ముయ్ రా! సెప్పిందిసేయడమే నీపని. అయినా ఆల్లేమన్నా దేవుల్లేంటిరా వాళ్ళు సెప్పిందల్ల జరగడానికి, పులసలు, టూనా చేపలు దొరికే వేల ఇది. మాంచి గిట్టుబాటు వచ్చేటప్పుడు ఇదంతా ఎవడు పట్టించుకుంటాడు రా!" "ఓ పేద్ద హొటేలువాళ్ళు అప్పుడే బేరం కుదుర్చుకున్నారు కూడా! ఈ టైంలో నాకు నువ్వు నీతులు సెప్పడానికి సూసావనుకో సొరచేపకి నిన్ను ఎరవేసేస్తాన్రోయ్. పోయి నేసెప్పిన పని సూడరా నెలతక్కువ నాయాల." అని వెళ్ళిపోయాడు. ఈరిబాబు చాలా భారంగా నిట్టూర్చాడు. తనకి ఇవన్నీ అలవాట...