IMMORTALS OF MELUHA (మెలుహా మృత్యుంజయులు)
ఈ పుస్తకం సిరీస్ ఈపాటికే చాలామంది చదివివుంటారు."అమీష్ త్రిపాఠి"యొక్క రచనాశైలిని ఇష్టపడనివారు ఉండరూఅంటే అతిశయోక్తి కాదు. నేను ఈ శివ ట్రైలాజీని వారం రోజుల్లొచదివాను. నేను చదివాను అనడం కంటే ఈ నవల సిరీస్ నాచేత చదివించింది అనడం సబబు. ఎందుకంటే తరవాత ఏమి జరిగి ఉంటుంది అన్నంత సస్పెన్స్, ఉత్సుకత,భాష మీద పట్టు, పాఠకుడినీ ఆసాంతం అందులో లీనం చేయగల రచనావైశిష్ట్యం ఇదంతా ఉండడం వల్లే ఈ సీరీస్ ఆల్-టైం బెస్ట్ సెల్లర్గా ఇప్పటికీ పాఠకలోకాన్ని అలరిస్తోంది. నాకు ఈ పుస్తకంగురుంచి ఫర్స్ట్ తెలిసిందీ, విన్నది మా "బావగాడివ ల్ల ", ముందు వాడికి చాలా థ్యాంక్స్. వాడి మాటల్లో చెప్పాలంటే "శివుడు మామూలు మనిషిగా ఒకవేళ మన సమాజంలోకి వస్తే మన కట్టుబాట్లు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, తోటి మనుషులు యొక్క హెపొక్రసీని, వ్యక్తిపూజనీ, మూర్ఖత్వాన్నీ, నమ్మకాన్నీ, కులవ్యవస్థనీ ఎలావాటినీ అర్ధంచేసుకుంటాడొ, ఆవాంతరాలని ఎలా ఎదురుకుంటాడొ చాల ఇంటెలెక్చువల్గా ఇంటర్ప్రిటషన్ చేసిన బుక్, ఇది ఒక లవ్ స్టోరి, ఒక యాక్షన్-థ్రిల్లర్, నువ్వు ఏ ఏంగిల్లో చూస్తే ఆ ఏంగిల్లో నీకు అలా కనపడుతుంది....