IMMORTALS OF MELUHA (మెలుహా మృత్యుంజయులు)
ఈ పుస్తకం సిరీస్ ఈపాటికే చాలామంది చదివివుంటారు."అమీష్ త్రిపాఠి"యొక్క రచనాశైలిని ఇష్టపడనివారు ఉండరూఅంటే అతిశయోక్తి కాదు. నేను ఈ శివ ట్రైలాజీని వారం రోజుల్లొచదివాను. నేను చదివాను అనడం కంటే ఈ నవల సిరీస్ నాచేత చదివించింది అనడం సబబు. ఎందుకంటే తరవాత ఏమి జరిగి ఉంటుంది అన్నంత సస్పెన్స్, ఉత్సుకత,భాష మీద పట్టు, పాఠకుడినీ ఆసాంతం అందులో లీనం చేయగల రచనావైశిష్ట్యం ఇదంతా ఉండడం వల్లే ఈ సీరీస్ ఆల్-టైం బెస్ట్ సెల్లర్గా ఇప్పటికీ పాఠకలోకాన్ని అలరిస్తోంది.
నాకు ఈ పుస్తకంగురుంచి ఫర్స్ట్ తెలిసిందీ, విన్నది మా "బావగాడివల్ల", ముందు వాడికి
చాలా థ్యాంక్స్. వాడి మాటల్లో చెప్పాలంటే "శివుడు మామూలు మనిషిగా ఒకవేళ మన సమాజంలోకి వస్తే మన కట్టుబాట్లు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, తోటి మనుషులు యొక్క హెపొక్రసీని, వ్యక్తిపూజనీ, మూర్ఖత్వాన్నీ, నమ్మకాన్నీ, కులవ్యవస్థనీ ఎలావాటినీ అర్ధంచేసుకుంటాడొ, ఆవాంతరాలని ఎలా ఎదురుకుంటాడొ చాల ఇంటెలెక్చువల్గా ఇంటర్ప్రిటషన్ చేసిన బుక్, ఇది ఒక లవ్ స్టోరి, ఒక యాక్షన్-థ్రిల్లర్, నువ్వు ఏ ఏంగిల్లో చూస్తే ఆ ఏంగిల్లో నీకు అలా కనపడుతుంది." వాడు ఇలా ఈ బుక్ సిరీస్ గురుంచి చెప్పగానే నాకు ఎలాగైనా కొని చదవాలి అన్నంత కోరిక పుట్టింది.
అప్పటివరకూ నాకు తెలిసిన శివుడంటే ఒక జ్ఞాని, బోళా శంకరుడు, ఒక యోగి, ఒక తపస్వి. ఈ పుస్తకం చదివినతరవాత నా దృష్టి లో శివుడు ఒక "దేశభక్తుడు", "లీడర్", "జీవితప్రేమికుడు" "ప్రకృతి ఆరాధకుడు", "తనచుట్టూ ఏ కంచెకట్టకుండా తనని అభిమానించేవాళ్ళని, ప్రేమించేవాళ్ళని తన గుండెల్లో కోటకట్టి రక్షించాలనుకునే సైనికుడు", "యుద్ధ వీరుడు" ముఖ్యంగా "హాస్యచతురుడు", మనం ఈ కధలో సతీదేవిని ప్రేమించే ఎపిసోడ్లో శివుడు ఖచ్చితంగ మనకి ఒక "క్యూట్ లవర్ బొయ్"లా కూడ కనపడతాడు. :) :) :D
కధవిషయానికి వస్తే ఇది చాల పెద్దకధ అందుకే రచయిత మూడు పుస్తకాలుగా తీసుకొచ్చారు. అలాని ఇది మనంచదవలేనంతగా అర్ధంచేసుకోలేనంతగా ఉంటుందీ అనుకోవటం పొరపాటే! ఇది సింపల్ ఇంగ్లీష్ లో చక్కగా హైస్కూల్ పిల్లలు కూడ ఆడుతూ పాడుతూ చదివేలాగే ఉంటుంది. కొంచెం టేస్ట్ ఉన్న పాఠకులైతే దీన్ని ఎంచక్క ఒక చల్లని సాయంత్రమో లేక ఒక వెన్నెలరాత్రో మన గార్డెన్ లో కుర్చీ వేసుకుని అమ్మ చేతి పకోడీలు తింటూ మనం ఈ పుస్తకాన్ని భీభత్సంగా ఆనందించి చదవొచ్చు. ఈ కధలోని కొన్ని చాప్టర్స్ లో (కొన్నేంటి నా మొహం చాలా చాప్టర్స్ లో) మనం పాఠకులంకాదు ప్రేక్షకులం, మనం బుక్ చదివినట్లు ఉండదు ఒక థ్రిల్లింగ్ సినిమానే చూస్తున్నట్టు ఉంటుంది. అది నేను చెప్పడంకన్న చదవనివాల్లు చదివితెలుసుకుంటేనే ఎక్కువ మజా........
ఇందులో శివుడిపాత్ర ఎంత క్రొత్తగా, ఉన్నతంగా ఉంటుందో, అలాగే కొన్ని పాత్రలుకూడా అంతే వైవిధ్యంగా ఉంటుంది. ఈ పాత్రలు మన పురాణల నుండి స్ఫూర్తి పొంది తీసుకున్నవి. మచ్చుకకి కొన్ని పాత్రలు ప్రస్థావించవలసి వస్తే ఈ కధలో హీరోయిన్ "సతీదేవి" మూఢనమ్మకాలను, సామాజిక కట్టుబాట్లను, తండ్రి మీదా, వంశగౌరవం మీదా ప్రెమాభిమానాలతో భరించే ఒక ఉన్నత స్త్రీత్వం ఒక కోణంలో కనిపిస్తుంది. అలాగే శివుడిని మూగగ ప్రేమించి తనలోని అంతర్గత భయాలని, అపోహలని, సామాజిక బహిష్కారాన్నీ, శివుడిచ్చిన ధైర్యంతో ఎల యుద్ధంచేసి గెలిచి, తన అస్థిత్వాన్ని నిలుపుకున్న ఒక ఆత్మవిశ్వాశమున్న స్త్రీగా మరో కోణంలో ఆవిష్కరిస్తుంది.
అలాగే వీరభద్రుడూ, నందీ, బృహస్పతీ వీరు ముగ్గురు స్నేహానికీ, స్వామిభక్తికీ, నమ్మకానికీ నిర్వచనాలు. అలాగే "తనలోలేని శక్తినీ, సమర్ధతనీ, మంచిని ఉన్నట్లు చూపించికుని, తానొక సమర్ధవంతమైన రాజుగా ముసుగువేసుకుని చరిత్రలో గొప్పగానిలవడంకోసం సొంతవాల్లని చరిత్రహీనులని చెయ్యడానికి కూడా వెనుకాడని రాజుగా, కూతుర్ని అమితంగా ప్రెమించే తండ్రి గా , కూతుర్ని సామాజిక బహిష్కారమ్నుంచీ తప్పించలేని అసహాయ తండ్రిగా :దక్షుడి: పాత్ర కనిపిస్తుంది", కాని అది చివరలో రెవీల్ చేస్తారు.
ఇలా చెప్పుకుంటూపోవాలి అంటే బోల్డున్నాయి. ఇప్పుడే చెప్పేస్తే చదవనివాళ్ళు ఉంటే వాళ్ళకి చదివినప్పుడు ఉండే ఆ "కిక్" పోతుంది.
చివరగా నా పర్స్పెక్టివ్లో (IN MY PERSPECTIVE) చిన్న కంక్లూషన్ (CONCLUSION) ఇస్తాను. "ఏ మనిషిలోనూ, ఏ వ్యవస్థలోనూ కూడా శాశ్వతమంచీ, శాశ్వతచెడుతనం అని రెండు ఉండవు, అది మనంచూసే కళ్ళని, మనసునీబట్టీ మారుతుంది. మార్పు అన్నది లోకసహజం అది దేవుడుకూడా అపలేనిది. ఎవరయినా మనం పెట్టుకున్న నియమాలకిగాని వ్యవస్థకిగాని పూర్తి వ్యతిరేక దిశ గా ఉంటే అదివాళ్ళ చెడ్డతనం, తిరుగుబాటుదనం కాదు, అది "భిన్నత్వం" మత్రమే ("THEY'RE JUST DIFFERENT, NOT EVIL") . ఆ "భిన్నత్వం" సమాజాన్ని ఉద్ధరిస్తుందో, లేక అధఃపాతాళానికి తొక్కుతుందో కాలమే సమాధానం చెబుతుంది. దానికి దేవుడు కూడా జవాబుదారి. కాలానికి సాక్షి. అందుకే మనం అంటూ ఉంటాము "టైం వస్తే వాడికి/దానికి దేవుడే బుద్ధిచెప్తాడ్ర" అని అంటాం . అలాంటి "కాలాతీతుడని" మనచేత స్తొత్రంచేయబడుతున్న దేవుడే కాలాన్ని అంత గౌరవిస్తున్నప్పుడు............. మనుషులం మనం ఎంత????
"TIME IS THE ANSWER TO SOME PUZZLES"
"TIME IS THE PUZZLE TO SOME ANSWERS"
"LORD SHIVA IS ANSWER TO ANY PUZZLES WITH NO BOUNDARIES OF TIME"
"OM NAMAHA SHIVAYA"
THE UNIVERSE BOWS TO LORD SHIVA, I BOW TO LORD SHIVA
"TIME IS THE ANSWER TO SOME PUZZLES"
"TIME IS THE PUZZLE TO SOME ANSWERS"
"LORD SHIVA IS ANSWER TO ANY PUZZLES WITH NO BOUNDARIES OF TIME"
"OM NAMAHA SHIVAYA"
THE UNIVERSE BOWS TO LORD SHIVA, I BOW TO LORD SHIVA

Comments
Post a Comment