బాపు - ఒక "చిత్ర" మాంత్రికుడు - ఒక "చరిత్ర"
బాపు ..... ఈ పేరు వినగానే మన తెలుగు వారికి వెంటనే గుర్తొచ్చేది ఇద్దరు . అందులో ఒకల్లు భారతదేశానికి బానిసపు సంకెళ్ళను తెంచి స్వేచ్చాసమీరాన్ని అందించిన మహోన్నతుడు . ఇంకొకల్లు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తెలుగు సినిమాని అంతర్జాతీయ జాతీయ వేదికన తన ఆప్తమిత్రుడు ముళ్ళపూడి వెంకట రమణ తో కలిసి ఒక సుందర దృశ్యకావ్యం లా తీర్చిదిద్దిన మహోన్నతుడు . ఒక అమ్మాయిని పొగడాలి అంటే మనం ముందు తల్చుకోవాల్సింది ఆయననే . ఎలాగంటే ఆయన గీతల్లోనే ప్రాణంపోసుకున్న అప్సరసల అసలు పేరు " బాపు బొమ్మ ". అదే అమ్మాయిల అందాన్ని వర్ణించడానికి అందమయిన కొలమానం ఇప్పటికీ అదే . అలాగ తెలుగువారి హృదయాలలో ఒక చెరగని ముద్రవేసి తన సినిమాలతో సంస్కారాన్నీ , అచ్చ తెలుగు నుడికారాన్నీ , అద్భుతమైన చిత్రాలనీ మనకు అందించిన " బాపు " ఈరోజు స్వర్గస్థులయ్యారు . అట్లాంటి మహోన్నతులు వెండి తెరపైనే కాదు బుల్లితెరపై కూడా చేసిన ఎన్నో అద్భుతాలను చెప్పడానికి చిన్నవాడినైన నా తరమూ కాదు ఆ అర్హతా లేదు . " భాగవతాన్ని " రసరమ్యంగా చెప్పి ఆబ...