Posts

Showing posts from 2013

ప్రకృతిలో ఒకడు

Image
"మీరు ఇప్పుడు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచీ వాతావరణ విశేషాలు వింటున్నారు. బంగాలాఖాతంలో అల్పపీడనంవల్ల తుఫాను సూచనలు కనపడుతున్నాయి  దీనివల్ల రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో భారీవర్షాలుపడే అవకాశం ఉంది. జాలర్లు ఎవరూ సముద్రంలోకి వేటకి వెళ్ళకూడదని సూచిస్తున్నాము." "ఒరేయ్! ఈరిబాబు రేపు ప్రొద్దుగుంకేలోపు సముద్రంలోకి మన పడవలు వేటకి ఎల్లాల. నువ్వు దగ్గరుండి బోటుల్లోకి వలలు, తెరచాపలు గట్రాలాంటివి మనోల్లకి సిద్దంచేసి ఉంచమని చెప్పు." "పెద్దయ్యా! మరి తుఫాను అంటున్నారుకదయ్యా! పెమాదం ఏమోనయ్యా వెళితే?" "నోర్ముయ్ రా! సెప్పిందిసేయడమే నీపని. అయినా ఆల్లేమన్నా దేవుల్లేంటిరా వాళ్ళు సెప్పిందల్ల జరగడానికి, పులసలు, టూనా చేపలు దొరికే వేల ఇది. మాంచి గిట్టుబాటు వచ్చేటప్పుడు ఇదంతా ఎవడు పట్టించుకుంటాడు రా!" "ఓ పేద్ద హొటేలువాళ్ళు అప్పుడే బేరం కుదుర్చుకున్నారు కూడా! ఈ టైంలో నాకు నువ్వు నీతులు సెప్పడానికి సూసావనుకో  సొరచేపకి నిన్ను ఎరవేసేస్తాన్రోయ్. పోయి నేసెప్పిన పని సూడరా నెలతక్కువ నాయాల." అని వెళ్ళిపోయాడు. ఈరిబాబు చాలా భారంగా నిట్టూర్చాడు. తనకి ఇవన్నీ అలవాట...

నేనూ, రామయ్య!!!

Image
నేను : ఏమయ్యా రామయ్య! ఇది ఏమన్నా నీకు న్యాయంగా ఉందా!!! రామ : ఏమిటయ్యా అనంతూ...... ఎప్పుడూ ఎదో ఒకటి లేదని ఏడుస్తావు (నాపై చిరునవ్వు బాణాన్ని సంధిస్తూ....) నేను : అసలు ఎమున్నాయని రామా! నాకు చెప్పుకోవడానికీ..... నాకు తెలిసిన వాళ్ళందరూ మంచి సాలరీస్ తో ఎంజాయ్ చేస్తుంటే, నేను మాత్రం ఇలా దారంలేని గాలిపటంలాగా, తాడులేని బొంగరంలాగా, ఎడ్రెస్ లేని పోస్ట్-కార్డ్ లాగా, హెడ్ లైట్ లేని ఆడీకార్ లాగా, ఆధార్ కార్డ్ లేని సిటిజెన్ లాగా,నెయ్యిలేని పప్పన్నంలాగా, ఉప్పు లేని టమాటాసూప్ లాగా, ఎండింగ్ అనేది లేని మొగలిరేకులు సీరియల్ లాగా, తుప్పు పట్టిన ఇనుపరే......... రామ : చాలు చాలు చాలు!!!! నీతో వచ్చిన గొడవ ఇదేనయ్యా!! నీకు చాన్స్ ఇస్తే ఉపమానాలతో ఉప్మా వండేస్తావు అలాంటి రకానివి నువ్వు.....:) (అదే చిరునవ్వు బాణం విసురుతూ) నేను : నా బాధలు చెప్తుంటే !నీకు పార్లెమెంట్లో ప్రతిపక్షనాయకున్ని చూసినట్టు చూస్తున్నావు నన్ను.......... (కోపంగా ఆయన వైపు చుస్తూ) రామ : ఈ ప్రపంచంలో ప్రతివాడికి ఎన్నో బాధలు ఉంటాయ్. అంతెందుకు చివరికి జంతువులకి, పక్షులకి, పురుగులకి కూడా వాటి పరిధిలో వాటికి సమస్యలు ఉంటాయ్...... అవే ఎప్పుడ...

ఒంటరిగా........

Image
వెన్నెలదీపంతో నువ్వు....... చిక్కచీకటిలో నేను......... అవునులే, చీకటి తెలిసిన తర్వాతే కదా...... వెలుగు విలువ తెలిసేది.......