Posts

Showing posts from 2014

బాపు - ఒక "చిత్ర" మాంత్రికుడు - ఒక "చరిత్ర"

Image
బాపు ..... ఈ పేరు వినగానే మన తెలుగు వారికి వెంటనే గుర్తొచ్చేది ఇద్దరు . అందులో ఒకల్లు భారతదేశానికి బానిసపు సంకెళ్ళను తెంచి స్వేచ్చాసమీరాన్ని అందించిన మహోన్నతుడు . ఇంకొకల్లు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తెలుగు సినిమాని అంతర్జాతీయ జాతీయ వేదికన తన ఆప్తమిత్రుడు ముళ్ళపూడి వెంకట రమణ తో కలిసి ఒక సుందర దృశ్యకావ్యం లా తీర్చిదిద్దిన మహోన్నతుడు . ఒక అమ్మాయిని పొగడాలి అంటే మనం ముందు తల్చుకోవాల్సింది ఆయననే . ఎలాగంటే ఆయన గీతల్లోనే ప్రాణంపోసుకున్న అప్సరసల అసలు పేరు " బాపు బొమ్మ ". అదే అమ్మాయిల అందాన్ని వర్ణించడానికి అందమయిన కొలమానం ఇప్పటికీ అదే . అలాగ తెలుగువారి హృదయాలలో ఒక చెరగని ముద్రవేసి తన సినిమాలతో సంస్కారాన్నీ , అచ్చ తెలుగు నుడికారాన్నీ , అద్భుతమైన చిత్రాలనీ మనకు అందించిన " బాపు " ఈరోజు స్వర్గస్థులయ్యారు . అట్లాంటి మహోన్నతులు వెండి తెరపైనే కాదు బుల్లితెరపై కూడా చేసిన ఎన్నో అద్భుతాలను చెప్పడానికి చిన్నవాడినైన నా తరమూ కాదు ఆ అర్హతా లేదు . " భాగవతాన్ని " రసరమ్యంగా చెప్పి ఆబ...

IMMORTALS OF MELUHA (మెలుహా మృత్యుంజయులు)

Image
ఈ పుస్తకం సిరీస్ ఈపాటికే చాలామంది చదివివుంటారు."అమీష్ త్రిపాఠి"యొక్క రచనాశైలిని ఇష్టపడనివారు ఉండరూఅంటే అతిశయోక్తి కాదు. నేను ఈ శివ ట్రైలాజీని వారం రోజుల్లొచదివాను. నేను చదివాను అనడం కంటే ఈ నవల సిరీస్ నాచేత చదివించింది అనడం సబబు. ఎందుకంటే తరవాత ఏమి జరిగి ఉంటుంది అన్నంత సస్పెన్స్, ఉత్సుకత,భాష మీద పట్టు, పాఠకుడినీ ఆసాంతం అందులో లీనం చేయగల రచనావైశిష్ట్యం ఇదంతా ఉండడం వల్లే ఈ సీరీస్ ఆల్-టైం బెస్ట్ సెల్లర్గా ఇప్పటికీ పాఠకలోకాన్ని అలరిస్తోంది.            నాకు ఈ పుస్తకంగురుంచి ఫర్స్ట్ తెలిసిందీ, విన్నది మా "బావగాడివ ల్ల ", ముందు వాడికి  చాలా థ్యాంక్స్. వాడి మాటల్లో చెప్పాలంటే "శివుడు మామూలు మనిషిగా ఒకవేళ మన సమాజంలోకి వస్తే మన కట్టుబాట్లు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, తోటి మనుషులు యొక్క హెపొక్రసీని, వ్యక్తిపూజనీ, మూర్ఖత్వాన్నీ, నమ్మకాన్నీ, కులవ్యవస్థనీ ఎలావాటినీ అర్ధంచేసుకుంటాడొ, ఆవాంతరాలని ఎలా ఎదురుకుంటాడొ చాల ఇంటెలెక్చువల్గా  ఇంటర్ప్రిటషన్ చేసిన బుక్, ఇది ఒక లవ్ స్టోరి, ఒక యాక్షన్-థ్రిల్లర్, నువ్వు ఏ ఏంగిల్లో చూస్తే ఆ ఏంగిల్లో నీకు అలా కనపడుతుంది....

వెతుకుతున్నా నన్ను నేనే .........

Image
వెతుకుతున్నా నన్ను నేనే ప్రతి నిమిషం యుగమైపోతూ గడపలేకున్నా కనబడుతూ కవ్విస్తూ నవ్వుతున్న కాలాన్ని వెంటతరుముతున్నా నా అంతర్మధనం మరో క్షీర సాగరమధనమవుతున్నా నాలోంచి హాలాహలం వస్తోంది గానీ అమృతం కురవడంలేదని  తెలుస్తున్నా నిరాశ పడుతూ నేను,  మళ్ళీ ఆశ పెడుతూ కాలం గమ్యం తెలుసుకుంటూ నా ఈ పయనం......... ఎక్కడికో ఎంత దూరమో, బదులు తెలియని ప్రశ్నని నేనై వెతుకుతున్నా నన్ను నేనే......... .