వెతుకుతున్నా నన్ను నేనే .........

వెతుకుతున్నా నన్ను నేనే
ప్రతి నిమిషం యుగమైపోతూ గడపలేకున్నా
కనబడుతూ కవ్విస్తూ నవ్వుతున్న కాలాన్ని వెంటతరుముతున్నా
నా అంతర్మధనం మరో క్షీర సాగరమధనమవుతున్నా
నాలోంచి హాలాహలం వస్తోంది గానీ అమృతం కురవడంలేదని  తెలుస్తున్నా
నిరాశ పడుతూ నేను,  మళ్ళీ ఆశ పెడుతూ కాలం
గమ్యం తెలుసుకుంటూ నా ఈ పయనం.........
ఎక్కడికో ఎంత దూరమో, బదులు తెలియని ప్రశ్నని నేనై
వెతుకుతున్నా నన్ను నేనే......... .



Comments

Popular posts from this blog

ప్రకృతిలో ఒకడు

వందేమాతరం

బాపు - ఒక "చిత్ర" మాంత్రికుడు - ఒక "చరిత్ర"