అనగనగా ఒక డైట్ కధ!!!!!!!
"ఒరేయ్ వెధవ! జాగ్రత్తరా!!! బైక్ నెమ్మదిగా నడుపు నీకు ఎందుకంత కంగారు, నీ డ్రైవింగ్ అంటే నాకు అందుకే భయం"......వెనకాల కూర్చున్న మా నాన్నారు అరుస్తున్నారు. మా నాన్నని ఎప్పుడూ ఇలాగే భయపెడుతూ ఉంటాను. దాంతో నాకు ఆయన చేతిలో ఇంటికి వెళ్ళేంతవరకు తిట్లు, ఆ తర్వాత మా అమ్మ చేతితో చేసిన అట్లు తినడం అలవాటైపోయింది.
ఎప్పట్లాగే మా నాన్నగారిని ప్రొద్దున్న స్విమ్మింగ్ పూల్ నుంచీ ఇంటికి తీసుకురావడం రోజూ నా డ్యూటి. ఆ తర్వాత ఇంటికి రాగానే వెంటనే ఎవరి పనులకి వాళ్ళు రెడీ అయిపోయి అదే బైక్ మీద మా నాన్నారు, నన్ను మా చెల్లిని కాలేజ్ కి దింపి రైయ్ మని ఆయన ఆఫీస్ కి వెళ్ళడం, తిరిగి సాయంత్రం ఎవరి దారిన వాళ్ళం ఇంటికి రావడం, మేమేదో దేశాన్ని మా భుజస్కందాలమీద మోసి అలసిసొలసీ అన్నంత కట్టింగ్ ఇచ్చి ఒకళ్ళం బెడ్ మీదా, ఒకళ్ళు టీవీకి, కంప్యూటర్ కి అతుక్కుపోయేవాళ్ళం. పాపం మా అమ్మకి మా సేవ ఎక్కువైపోయెది. ఎప్పుడూ విసుక్కోకుండా మాకు నచ్చినవన్ని చేసేది . మా చెల్లి ఎప్పుడూ చిన్నపట్నుంచీ తిండి అంటే మాత్రం ఎలాదాన్ని ఎగ్గొట్టాలా అని తెగ స్కెచ్లు వేస్తూ ఉండేది. మనమెప్పుడూ ఎప్పుడు కంచంలో అన్నం పెడతారా?? ఏ కూరలు చేసారా?? ఈరోజు ఏమి వరైటీస్ చెయించుకుందామా అని తెగ ప్లాన్లు వేసేవాడ్ని. నా తిండి యావ తెలిసిన మా మాతాపితరులు నన్ను సంతోషపెట్టాలని నిరంతరం శ్రమించేవారు. ఎలా అంటే:
మా అమ్మ ఐతే రోజు టీ.వి.లో "మా ఇంట్లో వంట మీతో తంట" లాంటి ప్రోగ్రాంస్ ని ఎప్పుడు ఫాలో అవుతూ ఏకంగా అన్ని వంటల మీదా ఒక థీసిస్ ని తయారుచేసుకుని తన లేబొరేటరిలో (అదే వంటగది) నిరంతరం క్రొత్త రుచుల్ని సృష్టించాలని ఉబలాటపడేది. నిజం చెప్పొద్దు అద్భుతంగా ఉండేవి సుమీ!!! వంటకాలు. ఆవురావూరుమంటూ నేను, మా నాన్న తినేవాళ్ళం. (మా బామ్మ పాపం ఆవిడకి వయసు మీద పడటంతో ఎమి తిన్నా అరిగేది కాదు. సో, ఆవిడకి స్పెషల్ గా వేరే ఆరోగ్యకరమైనది వండేది).
ఇంక మా నాన్నగారు ఐతే సండే వచ్చిందీ అంటే ఒక నలుడూ భీముడూ లేటెస్ట్ సంజీవకపూర్ అందరు కలిసి మిక్సీలో మిక్స్ అయ్యి రీమిక్స్ అయ్యి వచ్చి వంట వండినట్టు ఉండేది మా నాన్నగారు వండితే?? అంత బాగుండెది. (ఇప్పుడు కూడ అనుకోండి కాని పాపం టైం కుదరత్లేదు ఆయనకి) :(.............
ఇలా నాలుగు కర్రీలు, ఎనిమిది పిండివంటలు లాగ హాయిగా సాగిపోతున్న నా జీవితంలో అనుకోని దెబ్బ. ఇంత భోజనప్రియుడినైన నేను "పూలరంగడు" చినిమా లో సిక్స్ పాక్ సునీల్ లాగా ఉంటానేంటి! "నువ్వు లేక నేను లేను" చినిమా లో సత్తిలాగ ఉండెవాడ్ని (కలర్ లో కాదులెండి బాడీవెయిట్ లో). నా ఫ్రెండ్స్ అందరు నన్ను హింసించడం మొదలుపెట్టారు. నువ్వు సన్నపడాలి ఎక్సర్సైస్ చేయాలి లేకపోతె ఒక్క అమ్మాయి నీతో ఫ్రెండ్షిప్ చేయదు :P :D అని లోకులు కాకులు అనుకున్నా!!!!
ఇదిలా ఉండగా ఇంకో డైమెన్షన్లో నా నోటికి మట్టి తినే గడియలు వచ్చేసాయి. మా నాన్నగారు ఎంత వంటలో సంజీవకపూర్ అయినా డిసిప్లిన్ లో మేజర్ చంద్రకాంత్. నా ఆకారం చూసి వీడు ఏంటి నాకు నలభైలలో పొట్ట వస్తే వీడికి ఇరవై నిండకుండానేయ్ పొట్ట వచేస్తోంది... లేనిపోని రోగాలన్ని ఇప్పుడే వస్తే చాల కష్టం అనిపించింది ఆయనకి. ఇదేయ్ ఫీలింగ్ మా అమ్మకి కూడా రావడంతో నా కష్టాలు మొదలయ్యాయి.......
అవి నా ఎంసెట్ రాసి వీధుల్లో తిరిగి ఇంట్లో ఖాళీగా కూర్చుని తొంగొనే రొజులు!!!!!!! అడవిలోని నిప్పుకి వాయుదేవుడు కూడా తోడైనట్టు ఎక్కదనుంచీ ఊడిపడ్డాయో తెలియదు మా ఇంటి లో ప్రొద్దున్నే "మంతెనగారి వంతెన" లాంటి హెల్త్ కాన్ష్యస్నస్ ప్రోగ్రాంలు మొదలయ్యాయి . ఇక చూడండి పప్పులో నాలుగు స్పూన్ల నెయ్యిని కుడితి తాగినట్టు తాగే నేను చచ్చినట్టు మానేయాల్సి వచ్చింది. అన్నం లేనిదే రాత్రి గడవని నాకు షిరిడీ సాయిబాబా లాగ బ్రెడ్ ముక్కలు, రొట్టె ముక్కలు తినాల్సి వచ్చేవి (పాపం ఆయనకి అవే చాలా ఇష్టం అట , అవే పెట్టేవారెమో???). హాయిగా ప్రొద్దున్న తొమ్మిది వరకూ తొంగొనే నేను..... చచ్చినట్టు ఆరింటికి లేవాల్సి వచ్చేది. లేచిన తర్వాత పరిగెత్తాల్సివచ్చేది. నాకు ఇంత ఆరోగ్యం మీద భక్తి కలగడానికి కారణం నా ఫ్రెండ్స్ ఎత్తిపొడుపులు, నాన్నగారి తిట్లు, అమ్మగారి నూనె లేని అట్లు,పండ్లు, మొక్కపెసలు......... మంతెన గారి వంతెన లాంటి ప్రోగ్రాంస్ ఊఊ???? హతవిధీ!!!!!!!!!
ఇంత చేస్తె మరి తగ్గక చస్తానా శుభ్రంగా తగ్గిపోయాను (తగ్గించేసారు)....... నన్ను చూసిన వాళ్ళంతా షాక్. ఏదో తెలుగు సినిమాలో హిందీ హీరోయిన్ తెలుగులో ఒక పద్యం పాడినట్టు, పది సుమోల్ని కుడి చేత్తో నలిపేసి దానితో వంద కిలోమీటర్ల పైన ఎగురుతున్న హెలికాప్టర్ని పేల్చెసిన హీరోని చూసినట్టు ఒక విచిత్రమైన అనుభూతికి లోనయ్యారు. మీడియావాళ్ళు వచ్చి ఇంటర్వ్యూవ్ చేసినంత పనిచేసారు నా బంధుగణం, నా స్నేహగణం. నాకు భలే అనిపించింది అనుకోండి. నోరు కట్టుకున్నందుకు కొంచం స్టార్ స్టాటస్ వచ్చింది అనుకుని, ఓఓఓ ఏదో నేను సల్మాన్ ఖాన్ కి నేనే ఫిట్నెస్ ట్రైనర్ అంత లెవెల్ లో నా డైట్ గురుంచి చెప్పేవాడ్ని........ దూరం నుంచీ మా అమ్మ నా వేషాలు చూసి నవ్వుకునేది వీడు ఓవర్ యాక్షన్స్ బాగా చేస్తున్నాడు. టీ.వి. సీరియల్స్ లో మాంచి భవిష్యత్తు ఉంది అనుకుంది..... హిహిహి!!!!!!!
స్లిం అయిపోవడంతో ఎప్పుడూ నా వైస్ట్ సరిపోక పండక్కి బట్టలు కుట్టించుకునే నేను, ఒక్కసారి టీ-షర్ట్, జీన్ పాంట్లతో పండగచేసుకున్నాను . అప్పుడు చూడండీ ఇక నా ఆనందానికి ఇక హద్దులేదు.....
అప్పుడు అనిపించిందీ ఒకటి కావాలంటే ఇష్టమైనవి వదులుకోవాలి, కష్టమైనవి అలవాటు చేసుకోవాలి అని..... అంతేకద జీవితం అంటే!!!!!! : )
కృష్ణచైతన్యగారు, మీ డైట్ కహానీ బాగుంది. "వీడు ఓవర్ యాక్షన్స్ బాగా చేస్తున్నాడు. టీ.వి. సీరియల్స్ లో మాంచి భవిష్యత్తు ఉంది," లాంటి పంచ్ డైలాగ్‌లు పేలాయి.
ReplyDeleteTHANK U SIR........:)
ReplyDeleteహహహ :) ఇప్పుడు మీ జీవితం నాలుగు ఇష్టమయినవి వదులుకోవటం, ఎనిమిది కష్టమయినవి అలవాటు చేసుకోవటంతో సాగుతోందనమాట :)
ReplyDelete@రసజ్ఞ :) :D
ReplyDeleteimtakee mantena gaari abhimaani ayyara leda??
ReplyDeletemee diet kadha chala bagundi andi.. :)
ఒరేయ్ తెలియని వాళ్లు ఇది నిజం గా నీ కథ అనుకుంటారు.. :) ;)
ReplyDelete