నేనూ, రామయ్య!!!


నేను : ఏమయ్యా రామయ్య! ఇది ఏమన్నా నీకు న్యాయంగా ఉందా!!!

రామ : ఏమిటయ్యా అనంతూ...... ఎప్పుడూ ఎదో ఒకటి లేదని ఏడుస్తావు (నాపై చిరునవ్వు బాణాన్ని సంధిస్తూ....)

నేను : అసలు ఎమున్నాయని రామా! నాకు చెప్పుకోవడానికీ..... నాకు తెలిసిన వాళ్ళందరూ మంచి సాలరీస్ తో ఎంజాయ్ చేస్తుంటే, నేను మాత్రం ఇలా దారంలేని గాలిపటంలాగా, తాడులేని బొంగరంలాగా, ఎడ్రెస్ లేని పోస్ట్-కార్డ్ లాగా, హెడ్ లైట్ లేని ఆడీకార్ లాగా, ఆధార్ కార్డ్ లేని సిటిజెన్ లాగా,నెయ్యిలేని పప్పన్నంలాగా, ఉప్పు లేని టమాటాసూప్ లాగా, ఎండింగ్ అనేది లేని మొగలిరేకులు సీరియల్ లాగా, తుప్పు పట్టిన ఇనుపరే.........

రామ : చాలు చాలు చాలు!!!! నీతో వచ్చిన గొడవ ఇదేనయ్యా!! నీకు చాన్స్ ఇస్తే ఉపమానాలతో ఉప్మా వండేస్తావు అలాంటి రకానివి నువ్వు.....:) (అదే చిరునవ్వు బాణం విసురుతూ)

నేను : నా బాధలు చెప్తుంటే !నీకు పార్లెమెంట్లో ప్రతిపక్షనాయకున్ని చూసినట్టు చూస్తున్నావు నన్ను.......... (కోపంగా ఆయన వైపు చుస్తూ)

రామ : ఈ ప్రపంచంలో ప్రతివాడికి ఎన్నో బాధలు ఉంటాయ్. అంతెందుకు చివరికి జంతువులకి, పక్షులకి, పురుగులకి కూడా వాటి పరిధిలో వాటికి సమస్యలు ఉంటాయ్......
అవే ఎప్పుడు ఏడవడం లేదు మీ మనుషలకు ఎందుకయ్య ప్రతిదానికి ఎడుస్తుంటారు....... మళ్ళీ పక్కవాడు ఎడుస్తుంటే లోపల పైశాచికంగా ఆనందిస్తుంటారు........

నేను : ఓ మానవోత్తమా! తమరూ మనుష్యులే,మళ్ళీ "మీ మనుషులూ" అని సంబోధిస్తారేంటి? అవతారం చాలించి  వైకుంఠం వెళ్ళగానే మరిచారా ఎమిటీ! సీతమ్మ తల్లిని రావణుడు ఎత్తుకుపోయినప్పుడు దిక్కులు పెక్కటిల్లేలాగా సీతమ్మగురుంచి శొకించింది ఎవరో????మేమూ "సంపూర్ణ రామాయణం" సినిమా ముప్పయ్ సార్లు చూసామండీ బాపూ-రమణల దయవల్ల :) :) (ఒక మంచి పాయింట్ దొరికిందని లోపల ఆనందపడుతూ.............)

రామ : (నా వైపు చాలా దయగా చుస్తూ) అవును! నేను మనిషినే కానీ, నువ్వు నన్ను సంభొదించావ్ చూసావ(మానవోత్తమ) అలా అందరిచేతా పిలిపించుకోవడానికి నేను మీకన్నా కష్టపడ్డాను..... నిజానికి "కష్టపడ్డాను" అనికూడా అనుకోలేదు ఎప్పుడూ.... నా ధర్మాన్ని(పనిని) నేను "ఇష్టపడ్డాను"..... ఇక సీతగురుంచి ఏడిచాను అంటావా. సీత అంటే నా భార్య అనెయ్ కాదు తను నా "ఆత్మ" నా "బుద్ధి" నా "మనసు". "మనసు"ని ఎప్పుడు "అహం"(రావణుడు) ఎత్తుకుపోతూ ఉంటున్ది. అహాన్ని జయించడమే "రావణసంహారం."

నేను : అబ్బా!! రామయ్యా నీ హితోపదేశాలు ఇక చాలు..... ఇది స్పీడ్ యుగం! త్రేతాయుగం కాదు, ఎంత తొందరగా డబ్బులు సంపాయించామా, దాన్ని ఎంత తొందరగా ఖర్చుపెట్టామా,ఎంత పేరు సంపయించామా, ఎంత తొందరగా పెళ్ళి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కనేసి వాల్లని కూడా ఒక మాంచి రేసు గుర్రాలలాగా  ఈ కాంపిటీషన్ వరల్డ్ లో పరుగులు పెట్టించామా........... అబ్బో ఇంకా చాల ఉందిలే........ అయినా ఇదంతా చేయాలి, జరగాలి అంటే చాల కష్టపడాలి. మేము నీలాగా ఆయోధ్యా నగరానికి రాజులం కాదు..... మా కష్టాలు నువ్వు పడలేవు(?).......

రామ : హహ హహ హ హహ!!! (తన అంతరంగంలో : వీడు నా పధ్నాలుగేళ్ళ   వనవాసాన్ని, సీతావియోగాన్ని,   రావణయుద్ధాన్ని మర్చిపొఇనట్టు ఉన్నాడు పిచ్చి వెధవ... :) :D)

నేను : ఎందుకు అలాగ నవ్వుతావ్? నేను ఎమన్నా జంధ్యాల జోక్స్ చెప్పానా???? (రాముడు అలాగ నవ్వుతుంటే నాకు కోపం నషాళానికి అంటింది తిట్టేద్దాం అనుకున్న..... దేవుడు కదా కోప్పడితే శాపం ఇస్తాడేమోనని భయపడి తమాయించుకున్నా ..... )

రామ : పిచ్చి అనంతూ!!!...... నీ మీద నాకెందుకయ్యా కోపం, నువ్వు నా బిడ్డలాంటివాడివి నువ్వు తిట్టేది ఎవరినో కాదు కద! నన్నే కదా, తిడితే నీకు శాంతిగా ఉంటున్దీ అంటే హాయిగా తిట్టుకో?? నువ్వు సంతోషంగా ఉండాలయ్యా... (చాల ప్రశాంతంగా అన్నాడు)

(ఆ దయకి నేను తట్టుకోలేకపోయాను, నా కోపం దూదిపింజలాగ ఎగిరిపొయింది, కొంచెం మెత్తబడుతూ)

నేను : మరి ఏంటి రామయ్య! నువ్వు నన్ను అర్ధంచేసుకోవట్లేదు, నా కష్టాల్ని తీర్చట్లేదు. నేను సంతొషంగా ఎలా ఉండను?? (కళ్ళు చిన్నగా చమర్చుతున్నాయి)

రామ : ముందు నిన్ను నువ్వు అర్ధంచేసుకో, అందరూ నిన్నే అర్ధం చేసుకోవాలని నియమంలేదుగా! నువ్వే తిరిగి వాల్లని అర్ధంచేసుకోవడాన్ని మొదలుపెట్టు అప్పుడు చూడు ఈ విశ్వం అంతా నీగురుంచే ఉన్నట్టు ఉంటుంది...... :)
      నువ్వు కష్టపడుతున్నావు అని ఆలోచించడం మొదలుపెడితే, ఆ పనిని నువ్వు ప్రేమించడంలేదన్న మాట...... ఈ లోకంలో అందరికీ ముందు ఇష్టమయినవి దొరకదు గుర్తుంచుకో......... మార్గంలో పరుగులో ముందు ఉన్నవాడు ఎప్పుడూ "విజేత" కాదు, అది భ్రమ అని తెలుసుకో. నీ ప్రయాణాన్ని ప్రేమించు , గమ్యాన్ని కాదు.......... నీకు అంతా తెలుసు అని భ్రమించకు, తెలియనివి నేర్చుకో. "అహాన్ని" పక్కన పెట్టినవాడు "అహం బ్రహ్మాస్మి" అవుతాడు.......... నువ్వు కూడ అవుతావు.... అప్పుడు "విజయం" నీ పక్కనే ఉంటున్ది . ఆనందం నీ రూపం అవుతుంది. విజయోస్తు! అనంతు విజయోస్తు!.....

నేను : ధన్యోస్మి స్వామీ! ధన్యోస్మి ఇప్పుడు నాకు నువ్వు అర్ధం అయ్యావ్. ఇక ముందు నేనేంటొ
అర్ధంచేసుకోవడానికి ప్రయత్నిస్తాను..... ఇతరులను అర్ధంచేసుకోవడాన్ని కొద్దిగానైన ప్రయత్నించి చూస్తాను........

                    అప్పుడు రాముడు అనంతవెలుగుతో మాయం అయ్యాడు..........

             లేచి చూస్తే అది కల! కలలాంటి నిజం. తొలి ప్రొద్దు కోయిల గొంతు మనొహరంగా ఉంది........ ఇంటర్వ్యువ్ కని ఆరోజుకి సిద్ధమయ్యాను.......
   
PS :  కొంచెం లేటుగా అందరికి "శ్రీరామనవమి" శుభాకాంక్షలు......:)  




Comments

  1. అద్భుతంగా ఉంది.

    ReplyDelete
  2. @dantuluri kishore varma meeku nacchinanduku chaala santoshamandi........... dhanyavadaalu... :)

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ప్రకృతిలో ఒకడు

వందేమాతరం

బాపు - ఒక "చిత్ర" మాంత్రికుడు - ఒక "చరిత్ర"